
పయనించే సూర్యుడు, మార్చి 10 2026 నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెల్డండ మండల పరిధిలోని గుండాల, పోచమ్మ గడ్డ తాండా, చెదురుపల్లి, నగరగడ్డ తాండా, భైరాపూర్ గ్రామాలను ఎంపీడీవో పరిశీలించారు. సోమవారం అన్ని గ్రామాల్లోనీ నర్సరీలను పరిశీలించి నాణ్యమైన విత్తనాలు నాటించాలని సంబంధిత సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించడం జరిగింది. అలాగే నర్సరీ నిర్వహణలో కూడా షేడ్ నెట్స్ ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. వివిధ గ్రామాలలోని గుండాల, చెదురుపల్లి ప్రాథమిక పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. గుండాల శివాలయం దగ్గర నిర్మించిన కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ ను పరిశీలించి ప్రజలు వినియోగించుకునేటట్లు చూడాలని సర్పంచ్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మణ్, ఏపీవో ఈశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్, ప్రజలు పాల్గొన్నారు.