బల్లెకల్ లో గడ్డివాము దగ్ధం భారీ ఆస్తి నష్టం

పయనించేసూర్యుడు న్యూస్ మార్చ్10 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని మండల పరిధిలోని బల్లెకల్ గ్రామంలో హరిజన కేంగారి పెద్దయ్య తండ్రి తిమ్మయ్య అను నేను విలేకరులకు నమస్కరిస్తూ వేడుకుంటున్న అంశం. ఎద్దులు ద్వారా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న నాకు శనివారం సాయంత్రం రోజు బల్లెకల్ గ్రామంలో నా ఇంటి ఆవరణలో మూగజీవుల పశు గ్రాసం కోసం సుమారుగా లక్ష రూపాయలు పెట్టి గడ్డివాము ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఎట్ల జరిగింది నాకు తెలియదు అగ్గి పడి పూర్తిగా అగ్నిలో గండి వాము కాలిపోవడం జరిగింది ఆదోని ఫైర్ ఇంజన్ వాళ్ళకి తెలుపగా ఆదోని ఫైర్ ఇంజిన్ వాళ్ళు బిజీగా ఉన్నందువల్ల ఆలూరు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటల ఆర్పి సరికి పూర్తిగా కాలిపోయింది కావున నాపై దయవుంచి నాకు నష్ట పరిహారం వచ్చేలాగా చేసి నన్ను ఆదుకోవాలని అధికారులను మరియు పాత్రికేయ మిత్రులను మీ రైతుగా వేడుకుంటున్నాను ఇట్లు.మీ..హరిజన కేంగారి పెద్దయ్య. తండ్రి తిమ్మయ్య. బల్లెకల్ గ్రామం.ఆదోని మండలం. కర్నూలు జిల్లా.ఫోన్ నెంబర్ 93465 77431