బోధన్ డివిజన్‌లో పంచాయతీ పనితీరుపై సమీక్ష సమావేశం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 10 బోధన్ :15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం వేగవంతం చేయాలని ఆదేశాలు ఈ నెలాఖరుకు 100% పన్నుల వసూళ్లు పూర్తి చేయాలని వేసవికి ముందే తాగునీటి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని ఏసీఎల్బీ ఇన్చార్జ్ దిలీప్ కుమార్ డిఎల్పిఓ నాగరాజ్ డిపిఓ శ్రీనివాస్ సూచించారు.బోధన్ డివిజన్ పరిధిలోని పంచాయతీ పనితీరుపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీవోలు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై మండల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా సమీక్ష సమావేశం చేపట్టారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో పంచాయతీ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, గ్రామాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *