పయనించే సూర్యుడు మార్చి 10 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: విద్యార్థులు పరీక్షలను భయంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇష్టంతో ఎదుర్కొంటేనే మంచి ఫలితాలు సాధించగలరని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు ఉట్నూర్ మండలం లక్కారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని సోమవారం ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుత.. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించేది విద్యేనని పేర్కొన్నారు పరీక్షలు జీవితంలో ఒక దశ మాత్రమేనని భయపడాల్సిన అవసరం లేదన్నారు ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి, సమయపాలన పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు ఉపాధ్యాయులు చెప్పిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని పునశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలు సాధించగలరని తెలిపారు మండల జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు కార్యక్రమంలో ఎంఈవో ఆశన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చివరగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పరీక్షా సిద్ధతపై చర్చించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.