మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10000 వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలి: ఏఐటీయుసి

* సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ కు అందజేత

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 10, తల్లాడ రిపోర్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మధ్యాహ్నం భోజన కార్మికులకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ. 10000 వేతనాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి, 2026 బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) జిల్లా గౌరవ అధ్యక్షులు నిమ్మటరు రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ కే. శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు తాళ్లూరు లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెపొంగు మల్లేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న మధ్యాహ్నం భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, మెనూ చార్జీలు పెంచాలని భోజన కార్మికులకు ఈఎస్ఐ.పిఎఫ్. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శ షేక్ రాకేమున్నేసా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహాదేవ లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యురాలు జక్కంపూడి వెంకటలక్ష్మి, సీతమ్మ, పూచి రమణ, వెంకటమ్మ, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *