మహిళలు ఏ పాత్రనైనా సమర్థవంతంగా నిర్వహించగలరు – అస్మా

పయనించే సూర్యుడు మార్చ్ 10 (జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ మండలంలోని తుంకుంట గ్రామంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంటికి ఒక తులసి మొక్క మరియు వివిధ రకాల పూల మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ.. మహిళలు ఏ పాత్రనైనా అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలరని పేర్కొన్నారు. “రెండు రెక్కలూ బలంగా ఉంటేనే పక్షి ఎగరగలదు. అలాగే, మానవాళి ప్రగతి పథంలో నడవాలంటే స్త్రీలు, పురుషులు సమాజానికి సమానమైన శక్తిగా నిలబడాలి. సమభావన అన్నది ఇంటి నుండే ప్రారంభం కావాలి. సమాజ నిర్మాణంలో స్త్రీలే నిజమైన ఆర్కిటెక్ట్లు” అని ఆమె అన్నారు.తోటి వనితలను ప్రోత్సహించడం, వారికి అండగా నిలవడం మరియు వారు తమ కాళ్లపై తాము నిలబడేందుకు సహకరించడం ప్రతి ఆలోచనాపరులైన మహిళా కర్తవ్యం అని అస్మా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుజాత, చంద్రకళ, స్వప్న, సుజాత, ఈశ్వరమ్మ, మమత, అంజలి, చంద్రమ్మ, లక్ష్మమ్మ, పవిత్ర, ఉమా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *