పయనించే సూర్యుడు10-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కులం, మతం కంటే మానవత్వం మిన్న అని కోరట్లకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ మరోసారి నిరూపించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో (రోజా) ఉన్నప్పటికీ, ప్రాణాపాయంలో ఉన్న ఒక రోగి కోసం ఆయన ముందుకు వచ్చి రక్తదానం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విశేషాలు: 53వ సారి రక్తదానం: ఇమ్రాన్ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 53 సార్లు రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. రోజాలో ఉన్నా వెనకాడలేదు: ప్రతి ఏటా రంజాన్ నెలలో ఉపవాసం ఉండి కూడా రక్తదానం చేయడం ఇమ్రాన్ ప్రత్యేకత. నిన్న కూడా అదే స్ఫూర్తితో రక్తదానం చేశారు. మండల వ్యాప్తంగా ప్రశంసలు: ప్రాణదాతగా నిలుస్తున్న ఇమ్రాన్ సేవలను చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "మహమ్మద్ ఇమ్రాన్ చేస్తున్న ఈ గొప్ప కార్యానికి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఉపవాస దీక్షలో ఉండి కూడా రక్తదానం చేయడం ఆయనలోని సేవా గుణానికి నిదర్శనం షా ఖాన్, సోషల్ వర్కర్, కోరట్ల ఈ కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన ఆమిర్ ఖాన్, రియాజ్ భాయ్ తదితరులు పాల్గొని ఇమ్రాన్ అభినందించారు. ఇమ్రాన్ స్పూర్తితో యువత రక్తదానానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు..