పయనించే సూర్యుడు, మార్చి 10 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కేంద్రానికి చెందిన మట్ట రామస్వామి గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగల జోగయ్య సోమవారం మృత్యుని కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వచ్చిన కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆర్థిక భరోసానిస్తూ అనంతరం మృతుని కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు లింగం ముదిరాజ్, జ్యోతినిరంజన్, మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, వార్డు సభ్యులు శేఖర్, రాజు, నాయకులు నాగయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.