విద్యార్థులు కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

పయనించే సూర్యుడు మార్చ్ 10 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) అల్లాదుర్గం సీఐ రేణుక మేడం ప్రతి విద్యార్థి బాగా కష్టపడి చదివి లక్ష్యాలను అధిగమించాలని అల్లాదుర్గం సీఐ’ రేణుక అన్నారు ఆదివారం స్థానిక సాయి చైతన్య పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో హజరై మాట్లాడారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి పాఠశాలకు విద్యార్థుల తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు విద్యార్థుల తల్లులు సీరియల్స్ చూడకుండా తండ్రులు మధ్యం సేవించకుండా విద్యార్థులు సెల్పోన్ చూడకుండా ఉండాలన్నారు విద్యార్థులు గమ్యాలను చేరుకోవాలంటే కష్టపడి ఇష్టపడి చదవాలన్నారు విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు విద్యార్థులు శ్రద్ధతో చదివి పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు విద్యార్థులు బాగా చదివి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలన్నారు విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయుల సలహలు సూచనలు పాటిస్తూ సంస్కృతి సంప్రదాయాలు పాటించాలన్నారు విద్యార్థులు బాల్యం నుండి లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో అలరించాయి ఈకార్యక్రమంలో ఎంఈవో శేఖర్ రిటైర్డ్ ఎంఈవో వెంకటేశం కరస్పాండెంట్ గంగాధర్ గౌడ్ భూమేవ్వర్ గౌడ్ బొడ్ల శ్రీనివాస్ శ్రీధర్ గౌడ్ తదితరులున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *