విద్యార్థుల చదువు భోజనం పై ఆకస్మికంగా తనిఖీ

★ తిరుమలాపూర్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పై ఆకస్మికంగా తనిఖీ గ్రామ సర్పంచ్ బండారి లాలు

పయనించే సూర్యుడు మార్చి 10 దౌల్తాబాద్ రాజేష్) తనిఖీ – విద్యార్థుల చదువు, భోజనంపై వివరాలు తెలుసుకున్న గ్రామ నాయకులు తిరుమలాపురం జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో ఈరోజు గ్రామ సర్పంచ్ బండారి లాలు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారో, ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి చదువుల పురోగతిపై సమాచారం సేకరించారు. అలాగే పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై కూడా సర్పంచ్ ప్రత్యేకంగా విచారించారు. వంట ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకుని, విద్యార్థులకు నాణ్యమైన మరియు రుచికరమైన భోజనం అందించాలని వంట సిబ్బందికి సూచించారు. పిల్లల ఆరోగ్యం, చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి లాలు, ఉప సర్పంచ్ పోరం అధ్యక్షులు గడ్డం నాగరాజు, ఇంచార్జి హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు వసుంధర మేడం తదితర ఉపాధ్యాయులు, పాఠశాల వంట సిబ్బంది (ఆయాలు) పాల్గొన్నారు. గ్రామ నాయకులు పాఠశాల అభివృద్ధికి ఎప్పటికప్పుడు సహకరిస్తామని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు.