విద్యుత్ ఆర్టిజన్ల చలో హైదరాబాద్ రేపు మహా ధర్నా!

★ సమావేశంలో జేఏసీ నాయకులు మిద్దె శ్రీనివాసులు

పయనించే సూర్యుడు మార్చి 10 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ​నాగర్ కర్నూల్: విద్యుత్ శాఖలోని సుమారు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రేపు (మార్చి 10న) హైదరాబాద్‌లోని (టీజీఎస్పీడీసీఎల్) కార్యాలయం ముందు ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు టి.వి.ఏ.ఈ. జేఏసీ నాయకులు ప్రకటించారు. ​ప్రధాన డిమాండ్లు: ​విద్యార్హతలకు అనుగుణంగా కేడర్ మార్పులు చేయాలి. ​పని ఆధారిత కూలీలందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ​విద్యుత్ శాఖలో ఒకే సంస్థ - ఒకే విధమైన నియమాలు అమలు చేయాలి. ​ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మెకు వెళ్తామని జేఏసీ నాయకుడు మిద్దె శ్రీనివాసులు హెచ్చరించారు. కార్మికులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మంగి విల్సన్ కొంకలి లోకేష్ శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు