పయనించే సూర్యుడు మార్చ్ 10 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: వేములవాడ పట్టణ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో వేములవాడ పట్టణ మున్నూరు కాపు కార్యవర్గ సభ్యులు యజ్ఞం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సభ్యులు యజ్ఞంలో పాల్గొని వేద పండితుల చేత పూజా కార్యక్రమం నిర్వహించారు మున్నూరు కాపు కళ్యాణ మండపంలో అన్ని శుభకార్యాలు మంచిగా జరగాలని అందరికీ శుభం చేకూరాలని ఈ పూజా కార్యక్రమం నిర్వహించామని మున్నూరు కాపు కార్యవర్గ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ మున్నూరు కాపు కుల సంఘం కార్య వర్గ సభ్యులు కుటుంబ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.