వేలంపాట ద్వారా రూ 31.60 లక్షల ఆదాయం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 10.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండలంలోని దిగువపల్లి పంచాయతీలో గల వనరుల కు నిర్వహించిన వేలంపాట ద్వారా రూ 31.60 లక్షలు ఆదాయంగా సమకూరినట్లు మదనపల్లి డిఎల్పిఓ నాగరాజ తెలిపారు దిగువపల్లి సచివాలయంలో సర్పంచ్ సోనీ అధ్యక్షతన నిర్వహించిన వేలం పాటలలో పంచాయతీ పరిధిలో సంవత్సర కాలం పాటు కోళ్ల దుకాణాన్ని నిర్వహించుకునే హక్కు గాను జరిగిన వేలంపాటలో సోము రూ 30 లక్షలు హెచ్చుగా పాడి పాట దక్కించుకున్నారన్నారు అదేవిధంగా సంవత్సర కాలం పాటు ఐస్ క్రీమ్ విక్రయించుకునే హక్కు గాను రూ 1.60 లక్షలు ఆదాయంగా సమకూరిందని ఆయన వివరించారు వేలంపాటలో పోటాపోటీగా జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంచాయతీకి దాదాపు రూ 18 లక్షల అదనంగా ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు గతేడాది ఇదే వేలంపాట ద్వారా రూ 12.05 లక్షలు ఆదాయం రాగా ప్రస్తుతం జరిగిన వేలం పాటలో అంతకు రెండింతలు వచ్చినట్లుగా ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పవన్ సిబ్బంది సచివాలయ అధికారులు స్థానికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *