పయనించే సూర్యుడు మార్చ్ 10 నిర్మల్ జిల్లా కడం మండలం పండ్వాపూర్ గ్రామానికి చెందిన బండి గంగన్న రెండు సంవత్సరాల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ₹54,510 ప్రీమియంతో పాలసీ తీసుకున్నారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మృతి చెందగా, కంపెనీ తరఫున బీమా మొత్తంగా ₹10,31,250 చెక్కును ఆయన నామినీ అయిన భార్య అమృత అందజేశారు. ఈ చెక్కును కంపెనీ డీజీఎం సురేష్ డీఎం రవి కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పండ్వాపూర్ గ్రామ సర్పంచ్ ఆడే విజయ ఉత్తర్ , కడం ఎస్‌ఐ సాయికుమార్ , సీనియర్ మేనేజర్ వినోద్ కుమార్ , ఎంప్లాయీస్ బెనిట్, అశోక్, ప్రవీణ్, రమేష్, డెవలప్మెంట్ ఆఫీసర్లు పోకవేణి మల్లేష్, నల్ల దేవేందర్, వేణు గౌడ్ , సేల్స్ ఆఫీసర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
