సాలంపాడ్ లో మహిళలకు ఘన సన్మానం.

★ జ్ఞాపికను సర్పంచ్ కు బహుకరిస్తున్న పంచాయతీ కార్యదర్శి హరిత

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 10 బోధన్ :మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సాలూర మండలం సాలంపాడ్ గ్రామ సర్పంచ్ శీలం నర్మదా సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా వార్డు సభ్యులు,వివో,అంగన్వాడి టీచర్,ఏఎన్ఎం,పాఠశాల టీచర్స్,ఆశా వర్కర్లను సర్పంచ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి హరిత సర్పంచ్ ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.మహిళలు లేనిదే సృష్టి లేదని సర్పంచ్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తార్,వార్డ్ సభ్యులు,వివో,ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం,అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.