సాలూర ఇంచార్జ్ తాహశీల్దార్ గా సురేందర్ నాయక్.

* బాధ్యతలు తీసుకున్న ఇంచార్జ్ తహశీల్దార్ సురేందర్ నాయక్.

పయనించే సూర్యుడు న్యూస్ 10 బోధన్:సాలూర మండల ఇంచార్జ్ తహశీల్దార్ గా సురేందర్ నాయక్ సోమవారం బాధ్యతలను చేపట్టారు. ఈయన రుద్రూర్ మండల ఉపతాహశీల్దార్ గా బాధ్యతలను నిర్వర్తించారు. గతంలో బాధ్యతలు నిర్వర్తించిన ఇంచార్జ్ తహశీల్దార్ శశిభూషణ్ సెలవులో ఉన్నారు.ఈయన స్థానంలో ఎడపల్లి మండల ఉపతహశీల్దార్ అనూష నిన్నటి వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వం సాలూర మండలం ఇంచార్జ్ ఉపతాహశీల్దార్ గా సురేందర్ నాయక్ ను నియమించారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో మండల అభివృద్ధి,ప్రజల సంక్షేమానికి అనుక్షణం కృషి చేస్తానని ఇంచార్జ్ తాహశీల్దార్ పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *