సాలూర ఉన్నత పాఠశాలలో స్థాయి సైన్స్ ఫెయిర్.

* విద్యార్థులు తయారుచేసిన మోడల్స్ ను పరిశీలిస్తున్న ఎంఈఓ.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 10 బోధన్ : సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారిని రాజీమంజుష హాజరై విద్యార్థులు తయారు చేసిన పలు మోడల్స్ ను పరిశీలించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ సైన్స్ లాంటి కార్యక్రమాల ద్వారా వారి నైపుణ్యం, బయటకు వస్తుందని ఎంఈఓ పేర్కొన్నారు. విద్యార్థులు తయారు చేసిన మోడల్స్ భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని ఎంఈఓ స్పష్టం చేశారు. పట్టుదల నైపుణ్యం ఉంటే దేనినైనా సాధించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు సంతోష్ యాదవ్,ఉపాధ్యాయులు జోత్స్న, విజయలక్ష్మీ, విఠల్ కాంబ్లే, విజయ్ కుమార్, సాయిలు, రాజకుమార్, స్వామి, సంగీతారావు, అబ్బయ్య, అంజన, అరుణ్ కుమార్, సుభాషిని, శోభారాణి, సుధారాణి, లక్ష్మీ, వనజ, రవికుమార్, అక్షయ్ కుమార్ యాదవ్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *