సివిల్స్ ర్యాంకర్ కు జియంలు అభినందనలు

పయనించే సూర్యుడు న్యూస్: 10-03-2026 పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-10 ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ పరీక్ష ఫలితాలలో అఖిలభారత స్థాయిలో 55వ ర్యాంకును సాధించిన గూడెల్లి సృజన కు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు అభినందనలు తెలియజేశారు.సోమవారం జిఎం కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు గూడెల్లి రాజేశం- రాణి లను జిఎంలు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చా నీ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సింగరేణి ఉద్యోగి కూతురు సివిల్స్ లో ర్యాంక్ సాధించడం చాల సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి దేశ సేవ చేయాలని ఆకాంక్షించారు.అలాగే నేటి యువత ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.తదుపరి సృజన తల్లిదండ్రులకు కార్పోరేట్ జనరల్ మేనేజర్ (పర్సనల్, ఐఆర్ అండ్ పియం) కవిత నాయుడు వారికి ఫోన్ చేసి అభినందలు తెలిపారు.కార్యక్రమంలో ఎస్వోటుజిఎంలు యం.రామ్మోహన్, బండి సత్య నారాయణ, విభాగాధిపతులు బి.టి.మురళీ కృష్ణ, బి.వి.సత్య నారాయణ, సుదర్శనం, సి.జె.సురేఖ, ఐలయ్య తో పాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *