104 వాహనాన్ని తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ వేణుగోపాల్

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 10.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి పరిధిలో గోసల కురపల్లిలో సేవలు అందిస్తున్న 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ చేశారు వాహనం యొక్క కండిషన్ను అదేవిధంగా పరిస్థితిని పరిశీలించారు వీటితోపాటు రోగులకు చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రోగులకు ఆయన వివరించారు అనంతరం 104 వాహనంలోని పలు రికార్డులను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మోనా వాహన డ్రైవర్ దేవరాజ్ డిఇఓ అపర్ణ ఎం హెచ్ సిమమత ఆశ కార్యకర్త రాదా అనిత రుక్మిణి తదితరులు పాల్గొన్నారు