అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

* ముక్కా సత్యనారాయణను వయస్వి కవితా మిత్ర పురస్కారం వరించింది.

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 11 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు ఉపాధ్యాయ రచయిత ముక్కా సత్యనారాయణ విడుదల చేసిన నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన అంతర్జాల కవితల పోటీలో భాగంగా పెనుగంచిప్రోలుకు చెందిన ఉపాధ్యాయ రచయిత ముక్కా సత్యనారాయణను వయస్వి కవితా మిత్ర పురస్కారం వరించింది. హైదరాబాద్ కు చెందిన యనమండ్ర సాహితీ వేదిక అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యనిర్వాహక అధ్యక్షులు పొర్ల వేణుగోపాలరావు ఈ మేరకు సత్యనారాయణకు ప్రశంసా పత్రాన్ని పంపించారు. గతంలో వేలాది రచనలు చేసిన సత్యనారాయణ ముప్పది పైగా బిరుదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన తన రచన శివరూపం నా తత్వం పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రచయితలు, ఉపాధ్యాయులు సత్యనారాయణను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *