అనారోగ్యంతో ఉన్న స్వామిదాసును పరామర్శించిన టీడీపీ నాయకులు

* 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 11 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామానికి చెందిన స్వామిదాసు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న టీడీపీ నాయకులు మంగళవారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ గ్రామ అధ్యక్షుడు బోయ యంకన్నతో పాటు భీమేష్, భీమన్న, చిన్న భీమేష్, కాశీం, బజారి, దేవదానం, పెద్ద వీరప్ప, శాంతప్ప స్వామిదాసును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ సర్పంచ్ రామన్న తరపున స్వామిదాసుకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయం అందిస్తామని వారు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *