పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 11 బోధన్ : బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లిలో అప్నా ఫంక్షన్ హాల్ యందు ముప్తి అతిక్ హైమద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి * నిజామాబాద్ పోలీస్ ప కమిషనర్ పి. సాయి చైతన్య, ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మౌలానా సయ్యద్ అబ్దుల్ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని , అనంతరం ఉపవాస విరమణ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. జిల్లా పోలీస్ కమిషనర్ కు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి శ్రీనివాస్ , సీఐలు వెంకటనారాయణ, విజయబాబు, ఎస్సైలు మచ్చేందర్ రెడ్డి , భాస్కరచారి , మనోజ్ , మహేష్ , హబీబ్ , మజీద్ కమిటీ సభ్యులు ఎంఐఎం ప్రెసిడెంట్ మీర్ ఇలియాస్ అలీ, కౌన్సిలర్ మునిషీర్ బాబా కౌన్సిలర్ మీరు గౌస్ , ఆసిఫ్ సుల్తాన్ మోల్ సాబ్ , మహమ్మద్ ఇమ్రాన్ హుస్సేన్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.