ఎంపీడీవో జమలారెడ్డి ఆధ్వర్యంలో మొరంపల్లి బంజార లో స్క్రీనింగ్ కార్యక్రమం..

* మిషన్ హెల్త్‌తో మొరంపల్లి బంజార్ మహిళల ఆరోగ్య పరీక్షలు.

పయనించే సూర్యుడు, మార్చి 11, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం , మొరంపల్లి బంజార పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రాణాళికలో భాగంగా మిషన్ హెల్త్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎస్‌హెజీ సెల్ఫ్ హెల్ప్ (డ్వాక్రామహిళలు)గ్రూపు సభ్యులైన సుమారు 11,560 మందికి ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్‌లు టెస్టులు నిర్వహించనున్నారు. గ్రామీణ మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం ముఖ్యమైనదిగా నిలిచింది.ఎంపీడీవో జమలారెడ్డి మరియు ఏపీఎం చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ క్యాంపులో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రక్తపీడనం, డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, ఆరోగ్య సమస్యలపై సమగ్ర పరీక్షలు చేపట్టారు. అవసరమైనవారికి మందులు, ఆరోగ్య సలహాలు అందించారు.ఏపీఎం కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది మహిళలు తమ ఆరోగ్య సమస్యలను గుర్తించుకుని, చికిత్స తీసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని క్యాంపులు నిర్వహిస్తాము” అని చెప్పారు. స్థానిక ఎస్‌హెజీ సభ్యురాలు రమ్యమ్మ మాట్లాడుతూ, “ఇలాంటి కార్యక్రమాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మాకు పరీక్షలు, మందులు ఇవ్వడం వల్ల మేము సంతోషిస్తున్నాము” అని అన్నారు.మండల అధికారులు, గ్రామ పంచాయతీ సభ్యులు, ఎస్‌హెజీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆరోగ్య సేవలపై అభినందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *