ఏకలవ్య పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

★ శిశువైద్య అధికారి డా"పాండురంగ, మెడికల్ ఆఫీసర్ డా"సింధు, ★ ఆయుర్వేద వైద్యులు డా"చంద్ర సింగ్

పయనించే సూర్యుడు, మార్చి 11 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలలోని వెల్దండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుండాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రజా పాలన 99 రోజుల ప్రత్యేక సేవల కార్యక్రమంలో ముఖ్య అతిథులు గా నిపుణులైన వైద్య బృందం ఆర్బిఎస్కే బృందంతో విద్యార్థులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం పిల్లలకు సాధారణంగా వచ్చే వ్యాధులు, పోషకాహార లోపాలపై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఔషధాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా" రమణ కుమార్, డా"కవిత, సూపర్వైజర్లు మురళీకృష్ణ, మనోజ్ కుమార్, కవిత, ఫార్మసీ ఆఫీసర్ పుష్ప, ఏఎన్ఎం జహంగీర్ బీ, లక్ష్మీకళ, ఆశా కార్యకర్త సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.