కేంద్రీయ విద్యాలయ తరగతులు ఈ అకాడమిక్ ఇయర్ నుండే ప్రారంభం. ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 11 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస రైల్వే పాఠశాల భవనాల్లో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు జరుగుతున్న పనులను మంగళవారం నాడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎనలేని కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయనీ ఆమె తెలిపారు.అడ్మిషన్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతాయని పలాస కు కేంద్రీయ విద్యాలయం రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సహకారం వల్లే సాధ్యమైంది ఆమె అంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.అడ్మిషన్ల పై ఎటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని, అర్హులకు మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయనీ ఆమె తెలిపారు.ఇందులో రాజకీయ నాయకుల జోక్యం ఉండదు పారదర్శినికంగా జరుగుతాయని ఆమె నొక్కి వక్కాణచారు.ఈ ఏడాది విద్యా సంవత్సరానికి తాత్కాలిక భవనంలోనే క్లాసులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలియజేశారు