కోదండ రామస్వామి కళ్యాణానికి చమర్తి కి ఆహ్వానం.

పయనించే సూర్యుడు-11-03-2026-రాజంపేట న్యూస్ : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ ఒకటవ తేదీన నిర్వహించే స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయాలని డిప్యూటీ ఈఓ శివప్రసాద్ చమర్తి జగన్ మోహన్ రాజును ఆహ్వానించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయం నందు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజును మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.