పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 11గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలంలోని ఇటీవల బైక్ దొంగతనాలు ఏ క్కువ అవడం వాళ్ళ పోలీస్ నమ్మదగిన సమాచారం తో గజ్వేల్ పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గజ్వేల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసిపి నరసింహులు వెల్లడించారు. కేసు వివరాలు: ఈ నెల 2వ తేదీ రాత్రి, గజ్వేల్ లోని బాలాజీ ఎన్క్లేవ్ నివాసి పురం శెట్టి ప్రవీణ్ కుమార్ తన పల్సర్ బైక్ ను ఇంటి ముందు పార్క్ చేయగా, మరుసటి రోజు ఉదయానికి అది కనిపించకుండా పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 107/26, U/Sec 303(2) కింద కేసు నమోదైంది. నిందితుల గుర్తింపు మరియు అరెస్ట్: కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల దృశ్యాలను, పాత నేరస్తుల రికార్డులను పరిశీలించిన పోలీసులు, వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూరుగుపల్లి స్వామి మరియు బూరుగుపల్లి మల్లేష్‌లను అనుమానితులుగా గుర్తించారు. ఈరోజు ఉదయం పిడ్చేడ్ వైపు నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు పల్సర్ బైక్‌పై వస్తున్న వీరిని పోలీసులు తనిఖీ చేయబోగా, మల్లేష్ పారిపోయాడు. స్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా, పల్సర్ వెహికల్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన మరో 7 బైకుల వివరాలను వెల్లడించాడు. స్వాధీనం చేసుకున్న వాహనాలు (మొత్తం 8): గజ్వేల్ పి.ఎస్ పరిధి: 01 పల్సర్, 02 ప్యాషన్ ప్లస్ (మొత్తం 3) గౌరారం పి.ఎస్ పరిధి: 02 ప్యాషన్ ప్లస్ మెదక్ టౌన్ పి.ఎస్ పరిధి: 01 ప్యాషన్ ప్లస్ నార్సింగి పి.ఎస్ పరిధి: 01 TVS XL చేగుంట పి.ఎస్ పరిధి: 01 ప్యాషన్ ప్లస్ ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన గజ్వేల్ ఎస్ హెచ్ఓ వి. రవి కుమార్, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్సైలు ప్రేమ్ దీప్, మరియు క్రైమ్ సిబ్బంది (వెంకటేష్, రవి, దివ్య, స్వామి, వెంకన్న)లను ఏసిపి నరసింహులు ప్రత్యేకంగా అభినందించారు. గజ్వేల్ అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ "పాత మోటార్ సైకిళ్ల లాక్ సెట్లు అరిగిపోవడం వల్ల ఇతర తాళాలతో సులభంగా తెరుచుకునే ప్రమాదం ఉందని , దొంగతనాలకు తావు లేకుండా పాత వాహనాలకు కొత్త లాక్ సెట్లు వేయించుకోవాలని ప్రజలను కోరుతున్నాము."
