గోల్ హనుమాన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 11 ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌లుగా గెలుపొందిన మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు గోల్ హనుమాన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్‌తో పాటు కౌన్సిలర్లు బొడ్ల రమేష్, నునుగొండ నరేష్, మాసుల ప్రవీణ్, బొడ్ల ఆనంద్, నాయకులు ధోనికెల నవీన్, బొడ్ల నగేష్ అరిగెల రాకేష్‌లకు శాలువాలు కప్పి సంఘం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ మరియు కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలోని మున్నూరు కాపు కుటుంబాలకు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా తాము ముందుండి సహకరిస్తామని తెలిపారు. అలాగే పట్టణంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సంగు గంగాధర్, ఓల్లాడపు లింబాద్రి, బొడ్ల రాజేందర్, ఎశమేని గణేష్, బూరుగు గంగారెడ్డి బొడ్ల రాహుల్, జెట్టి రాజు, సంగు ప్రతాప్, కోట దుర్గరాజు, నోముల శివ, , వంగరాజు, బోయిని హనుమండ్లు, ఆకుల మారుతి షేర్ నర్సారెడ్డి, పూప్పల నగేష్ తదితర కులసంఘ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *