ఘనంగా ఆమనిగంటి శ్రీరాములు జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు-11-03-2026-రాజంపేట న్యూస్ : ఏపీ ఎన్జీవోస్ వ్యవస్థాపకులు ఆమనిగంటి శ్రీరాములు జయంతి వేడుకలు మంగళవారం ఎన్జీవో కార్యాలయం నందు రాజంపేట తాలూకా అధ్యక్షులు ఎం.వరదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వరదయ్య మాట్లాడుతూ సేవ, త్యాగం, నిబద్ధత కలిగిన ఆమనిగంటి శ్రీరాములు జీవితం ఆదర్శప్రాయం అని కొనియాడారు. సాధారణ ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రస్థానం శాసనసభ్యుడిగా ఎదిగి ప్రజా గొంతుకుగా నిలిచిందని అన్నారు. అనంతరం శ్రీరాములు జయంతి వేడుకలను పురస్కరించుకుని పశు వైద్యాధికారిణిగా విశిష్ట సేవలందించిన కే.భాగ్యవతిని ఏపీ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం సంయుక్త కార్యదర్శి డి.మణి, విశ్రాంత వైద్యాధికారి గౌస్ ఖాన్, మహిళా జేఏసీ కోశాధికారి పూజ, ప్రియాంక, సుజాత, దీన, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *