చింతూరు ఐ టీ డీ ఏ లో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నిర్వహించిన ప్రజా దర్బార్ లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టం

★ఐటిడిఏ లో ప్రజా దర్బార్ కి అధికారులు డుమ్మా ★తూ తూ మంత్రంగా ప్రజా దర్బార్ నిర్వహణ పై పిర్యాదు చైర్మన్ ఆగ్రహం

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ , మార్చి 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డీ ఆధ్వర్యంలో ప్రజా వారధి కార్యక్రమం చింతూరు ఐటిడిఏ సమావేశ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చిన సమస్యలకు పిర్యాదు దారులకు సమాధానం ఇవ్వాల్సిన శాఖ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం పై ప్రజలు త్రీవ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినెట్ హోదా కలిగిన ఆదివాసీ వర్గం అయిన చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డీ ను అవమాన పర్చడమే కాకుండా ఆదివాసీ సమాజానికి, ప్రజలను నిర్లక్ష్యం చేయడం అని ప్రభుత్వ అధికారుల మీద ఆగ్రహంతో సమావేశం నుండి పిర్యాదు దారులు బయటకు వెళ్లిపోవడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతం లో గిరిజనులు కోసం పని చేయాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న తీరు పై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటిడిఏ అభివృద్ధి సంస్థ ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం కావడం లేదు అని అవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు గిరిజనుల పట్ల చిత్త శుద్ధితో పని చేయాలని లేని ఏడల శాఖ పరమైన చర్యలు తీసుకోవడం లో ఏ మాత్రం వెనుకడబోమని స్పష్టం చేశారు. అనంతరం ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్ల సునీత మాట్లాడుతూ అధికారులు చిత్త శుద్ధి తో పని చేయాలని అన్నారు. ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని తెలిపారు. ఈ ప్రజా దర్బార్ లో ఏ పీ ఓ రామ తులసి స్థానిక ఎంపీపీ సవలం అమల, జడ్పీటీసీ చిచ్చడీ మురళి, స్థానిక సర్పంచ్ కారం కన్నా రావు, ఆదివాసీ సంఘ నాయకులు చిచ్చడి శ్రీరామ్ మూర్తి, కుర్సం సుబ్బారావు, ఎమ్మార్వో కారం సుబ్బారావు, ఐటిడిఏ ఈ.ఇ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.