పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 11, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ కోటేకల్ గ్రామంలో జాతీయ రహదారి నందు ఎమ్మిగనూరు తాసిల్దార్ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. తహసీల్దార్ మాట్లాడుతూ శుచి శుభ్రత పాటిస్తూ వేసవికాలంలో నీటి అవసరం చాలా ఉంటుంది సాధారణంగానే వ్యక్తులకు డిహైడ్రేషన్ ఎండల వల్ల లోపిస్తుంది. అటువంటి పరిస్థితులను అధిగమించడం కోసం కొటేకల్ గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరూ ఆలోచించి సేవా దృక్పథంతో ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం దానికి నేను ముఖ్యఅతిథిగా రావడం చాలా సంతోషం అని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ నేతాజీ సేవా సొసైటీకి మంచి పేరు తీసుకొస్తూ ఇకముందు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారని ఈ చలివేంద్రాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సేవా సొసైటీ ప్రెసిడెంట్ గేటుఎర్రి స్వామి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి యువతరంలో సేవా దృక్పధాన్ని పెంచుతూ సమాజ హితం కోసం పనిచేసేటువంటి నేతాజీ సేవ సొసైటీ ఇకముందు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ రాముడు, వైస్ ప్రెసిడెంట్ శివ, జనరల్ సెక్రటరీ షేక్షావలి,సెక్రటరీ నాగేంద్ర, సభ్యులు శ్రీహరి, హనుమంతు, మహేంద్ర, శీను, నవీన్, విజయ్, నాని, శివ, రామకృష్ణ, పవన్, మహేష్ తదితర కోటేకల్ గ్రామ యువకులు పాల్గొన్నారు.