నలమోలు వెంకట శివరామ ప్రసాద్టీడీపీ అధికార ప్రతినిధి విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం

* పెనుగంచిప్రోలు మండలం తాసిల్దార్ శాంతిలక్ష్మి కు గ్రామ పంచాయతి కార్యదర్శి శ్యామ్ కుమార్ కు వినతి పత్రం

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 11 పెనుగంచిప్రోలు గ్రామంలో ఈ రోజున స్థానిక పెనుగంచిప్రోలు మండల తాసిల్దార్ శాంతిలక్ష్మికి పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్ కి వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ విజయవాడ నియోజకవర్గ పార్లమెంటరీ అధికార ప్రతినలమోలు వెంకట శివరామ ప్రసాద్ వినతి పత్రం అందించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుగంచిప్రోలు గ్రామంలో విలయ తాండవం చేస్తున్న కోతులు మరియు కుక్కల నుండి రక్షణ చర్యల గురించి. గత కొంతకాలం నుండి పెనుగంచిప్రోలు గ్రామంలో కోతులు మరియు కుక్కల బెడద తీవ్రరూపం దాల్చినది. మూడు రోజుల క్రిందట పడమర బజార్ లోని మాలపల్లె లో జొన్నలగడ్డ రామనాధం అనే వ్యక్తిని 10 కోతులు దాడిచేసి అతనిని దారుణంగా గాయ పరచినవి. అదేవిధంగా కాకాని బజారు నందు ఒక మహిళను కోతులు మూకుమ్మడి దాడి చేసి కొరికి గాయపరచినవి పై రెండు ఉదాహరణలు వెలుగులోనికి వచ్చినవి మాత్రమే. ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు రోజు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. కుక్కలు, కోతుల వలన గ్రామ రహదారుల వెంట ప్రజలు,ముఖ్యంగా పిల్లలు, వృద్దులు భయాందోళనలకు గురిఅగుచున్నారు. ఇది కాక రైతుల పంటలు, ముఖ్యంగా మామిడి, మొక్కజొన్న రైతులు వానర మూక ఆగడాలకు కుదేలావుతున్నారు. రోజు కొన్ని వేల రూపాయల పంట నష్టం వీటి వలన జరుగుతున్నది. అందువలన దయచేసి వీటిని అరికట్టి రక్షణ చర్యలు తీసుకొని గ్రామ ప్రజల ధన, ప్రాణాలను కాపాడవలసినదిగా మా మనవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
నలమోలు వెంకట శివరామ ప్రసాద్*నలమోలు వెంకట శివరామ ప్రసాద్ టీడీపీ అధికార ప్రతినిధి
*విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నీటి సంఘం అధ్యక్షులు కర్ల నాగేశ్వరరావు మాజీ సొసైటీ అధ్యక్షులు కొల్లా రఘురామయ్య. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *