పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఎంఇఓ పి ప్రసాదరావు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 11 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈనెల 14వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఎంఇఓ ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఆరు ఆశ్రమ పాఠశాల లు, మూడు గురుకులాలు, నాలుగు ప్రైవేట్ పాఠశాలలకు గాను మొత్తం 19 పాఠశాలల నుండి 704 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. వీరిలో 651 మంది మన మండలంలో మూడు పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతుండగా, భీముని గూడెం ఆశ్రమ పాఠశాలకు చెందిన 53 మంది విద్యార్థులు దమ్మపేట మండలంలో గొల్లగూడెం పరీక్ష కేంద్రంలో పరీక్ష వ్రాయనున్నట్లు తెలిపారు. అశ్వరావుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అశ్వారావుపేట లో 300 మంది, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల అశ్వారావుపేట లో 196 మంది, సున్నం బట్టి ఆశ్రమ పాఠశాలలో 155 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు వ్రాస్తారని తెలిపారు. వీరందరికీ తగిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ముఖ్యంగా పరీక్షల సందర్భంగా విద్యార్థులకు త్రాగునీరు, ప్రధమ చికిత్స మొదలు గునవి అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఎంఇఓ తెలిపారు.