పాఠశాల వీడుతున్న పదవ తరగతి విద్యార్థులు.

పయనించే సూర్యుడు 11 మార్చ్ 2026 చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా దగడపల్లి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులు నేడు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల హెడ్మాస్టర్ గోవిందు సార్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉన్న పిల్లలందరూ అల్లరి చేయడం సాధ్యమేనని కానీ జీవితం అల్లరి పాలు కావద్దని అన్నారు. నేటి వరకు మాతో ఆడుతూ పాడుతూ చదువుతూ ఉండేటి విద్యార్థులు నేడు మానుంచి ఉన్నత శిఖరాలను అందుకోవడానికి మా నుంచి దూరం అవుతున్నందుకు కాస్త బాధగా ఉన్న విద్యార్థులు ఉన్నత శిఖరాల చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఉన్న ఊరును కన్న తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఎప్పటికీ మర్చిపోవద్దని కోరారు రేపు జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో జిల్లాల్లో ఫస్ట్ ర్యాంకు రావాలని పిల్లలందరూ కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని విద్యార్థులను ఆశీర్వదించారు.అలాగే ఈ సందర్భంగా దగడపల్లి ఎంపీపీ పాఠశాల టీచర్ మోహన్ రెడ్డి సార్ విద్యార్థులకు పరీక్షల ప్యాడులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి విద్యార్థినీలు ఉపాధ్యాయులు పవన్. పురేందర్. శ్రీనివాసులు. శేఖర్. లలిత. సరస్వతి. సలేహా. తదితరులు పాల్గొన్నారు.