పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 10 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 12వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో అధ్యక్షురాలి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అలాగే సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను రెండు ప్రతులుగా సిద్ధం చేసి ఈ నెల 10లోపు కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.