పేరాంటాలమ్మ తల్లిని దర్శించుకున్న ఆదివాసీ నాయకులు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.11.2026 ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండల పరిధిలోని దేవారం గ్రామంలో స్వయంభువుగా వెలసిన గ్రామ దేవత ఐన పేరాంటాలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు.ఈ పేరాంటాలమ్మ పండుగను గ్రామస్తులందరు ఘనంగా నిర్వహించి ఘనంగా నైవేద్యం సమర్పించిన అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,ఆదివాసీ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం బంగారు బాబు,సొసైటి మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అయినాల శ్రీనివాసు,భారత్ ఆదివాసీ పార్టీ రంపచోడవరం డివిజన్ ప్రసార కార్యదర్శి చవలం విద్యాసాగర్,పూసం పార్వతి,అన్నిక సావిత్రి,అన్నిక సీతారామ్,అంబటి హనుమంతు మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *