పయనించే సూర్యుడు 11-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”ను జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి మండలం రంగధాముని పల్లె గ్రామంలో.ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు. అమలు చేయగా. మంగళవారం రోజున. రంగధామునిపల్లి గ్రామంలో ఉన్న డ్రైనేజీ, మురుగు కాలువలలో, పేరుకుపోయిన మట్టి, చెత్త, ప్లాస్టిక్ వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి కలగడం. దీనివల్ల కాలువలు పూడిక తీసి దోమలను, నివారించడానికి బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న. పిచ్చి మొక్కలను, చెత్తను,ట్రాక్టర్, తో తీసివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెల్ల అఖిల అనిల్ కుమార్, ఉప సర్పంచ్ ఎనుగందుల శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ స్రవంతి రాథోడ్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ రమాదేవి, రాజేశ్వరి, ఆశ రమాదేవి, ఎస్ ఎస్ జి పద్మ, గ్రామస్తులు పాల్గొన్నారు..