ప్రైవేట్ సెక్యూరిటీ కి పెట్టిన కండిషన్స్ వెంటనే రద్దు చేయాలి

★ సెక్యూరిటీ అధికారికి వినతిపత్రం అందించిన ఏ.వెంకన్న

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -11:- రామగుండం-3 ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ పాత టెండర్ లో పనిచేస్తున్న కార్మికులకు తిరిగి కొత్తగా రన్నింగ్, హైటు, వెయిట్, పిడిఎఫ్, లాంటి కండిషన్ లు పెట్టడాన్ని వెంటనే విరమించుకోవాలని మంగళవారం సెక్యూరిటీ అధికారి షర్బద్దీన్ ఏ ఎస్ ఓ కి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పాత టెండర్ కాలపరిమితి ముగిసి తిరిగి మళ్లీ పిలిచిన టెండర్స్ లో పెట్టిన క్లాస్ రన్నింగ్,హైట్,వెయిట్,పిడిఎఫ్, లాంటి కండిషన్స్ పొందుపరిచి టెండర్ పిలవడం ఇది సరైనది కాదని దీన్ని వెంటనే రద్దుచేసి ఇక్కడ పనిచేస్తున్న పాత కార్మికులందరినీ యధావిధిగా ఎలాంటి కండిషన్ లేకుండా కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం రమేష్,వి కుమారస్వామి, డి సంజీవ్, శ్రీసాయి,విజయ్,తదితరులు పాల్గొన్నారు.