పయనించే సూర్యుడు మార్చి 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలో మహానీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే గారి 129వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మండల సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. బాలికల విద్యకు బాటలు వేసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే గారని వారు కొనియాడారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి వారికి విద్య అందించడంలో ఆమె చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ సమానత్వం కోసం నిరంతరం పోరాడిన ధైర్యశాలి సావిత్రిబాయి ఫూలే గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. బాలికలతో పాటు దళితులకు విద్య అందించడంలో, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపడంలో మరియు రోగులకు సేవ చేయడంలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంతటి రాజేందర్ గౌడ్ వెంకటస్వామి గఫూర్ అల్లోజీ అంతటి నాగన్న శాయంపల్లి సర్పంచ్ శంకర్ గోవిందు శ్రీనివాసులు ఆంజనేయులు సంతోష్ సాగర్ రమేష్ రఘుబాబు తదితరులు పాల్గొన్నారు