బోయకొండను సందర్శించిన దేవాదాయ సంయుక్త కమిషనర్

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 11.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ తిరుపతి చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు శక్తి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన తనిఖీ చేశారు కొండ కింద వసతి గృహ నిర్మాణము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు స్వాధీన పరిచిన కమ్యూనిటీ భవనము మెట్ల మార్గంలో భక్తులకు నీడకు రూప్ టాప్ నిర్మాణం పనులు కొండపైన మరుగుదొడ్ల నిర్మాణము మొదలుకు పనులను పరిశీలించారు అదేవిధంగా సిసి కెమెరాలు పరిశీలించి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ ఏకాంబరముకు పలు సూచనలు ఇచ్చారు అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో డి ఈ జనార్ధన్ ఏ ఈ ఆనంద్ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు