పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడీ మార్చి 11 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కామారెడ్డి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంటికి ఒక తులసి మొక్క మరియు వివిధ రకాల పూల మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ.. మహిళలు ఏ పాత్రనైనా అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలరని పేర్కొన్నారు. “రెండు రెక్కలూ బలంగా ఉంటేనే పక్షి ఎగరగలదు. అలాగే, మానవాళి ప్రగతి పథంలో నడవాలంటే స్త్రీలు, పురుషులు సమాజానికి సమానమైన శక్తిగా నిలబడాలి. సమభావన అన్నది ఇంటి నుండే ప్రారంభం కావాలి. సమాజ నిర్మాణంలో స్త్రీలే నిజమైన ఆర్కిటెక్ట్లు” అని ఆమె అన్నారు.తోటి వనితలను ప్రోత్సహించడం, వారికి అండగా నిలవడం మరియు వారు తమ కాళ్లపై తాము నిలబడేందుకు సహకరించడం ప్రతి ఆలోచనాపరులైన మహిళా కర్తవ్యం అని అస్మా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా చంద్రకళ, స్వప్న, ఉమా తదితరులు గ్యాస్ పెంపుదల ఉపసంహరించుకోవాలి. పార్టీ డిమాండ్. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది చుక్కాపూర్ గ్రామాల్లో జరిగాయి వంట గ్యాస్ సిలిండర్‌కు రూ.60లు, వాణిజ్య సిలిండర్‌కు రూ.115లు కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతంగా మారింది. ఈ యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఆ భారాన్ని నేడు ప్రజలపై నెట్టడం ఘోరం. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై వంటగ్యాస్ ధర పెంపు పెద్ద దెబ్బ. అలాగే ఉపాధి కోసం తోపుడు బళ్ళు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలతో పొట్ట గడుపుకుంటున్న చిరు వ్యాపారులను వాణిజ్య సిలిండర్ ధర పెంపు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతేకాక అసంఘటిత కార్మికులు స్వల్ప ఆదాయాలు కలిగిన వారు కొనుక్కునే టిఫిన్, కర్రీ తదితర ఆహార ధరలు కూడా పెరుగుతాయి. అన్ని విధాల ప్రజా జీవితాన్ని ఘోరంగా నష్టపరిచే గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం పసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మనుగడకు ఆక్సిజన్ సమాకురుస్తున్న బీజేపీ కూడా ఒత్తిడి చేయాలని కోరుతున్నాం. గ్యాస్ భారాన్ని ఉపసంహారించాలని పార్టీకోరుతున్నది. ఈ కార్యక్రమానికి. జిల్లా కార్యవర్గ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు