మూడు మోటర్లు నీరుకలయికతో కలుషితమైతున్న నీరు

★ హంద్రీ నివాలో పుష్కలంగా నీరు ఉన్న సరఫరా లో అలసత్యం ★ ఎలక్షన్ టైం లో మాత్రం త్రాగునీటి అందిస్తామని గొప్పలు ★ కలుషిత నీటిలో ఫ్లోరింన్ అనేక రోగాలతో ప్రజలు ఇబ్బందులు

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 11, 2026 న్యూస్ గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల కేంద్రమైన గంజహళ్లి గ్రామంలో మూడు మోటార్ల కలయికతో నీరు కలుషితమై, గ్రామంలో ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని, ఆవేదన వ్యక్తం చెందారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలో హంద్రీనివాలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్న, త్రాగునీరు అందించే స్థితిలో పాలకులు లేకపోవడం సిగ్గుచేటు, గతంలో వైసిపి ప్రభుత్వం త్రాగునీటి సరఫరా అందించలేకపోయారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని, ప్రగల్ బాలు పలికారు. హామీలు ఇచ్చిన నాయకులు ఎక్కడ, గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి, అప్పటి వైసిపి పాలకులు ఒక వాటర్ ట్యాంకు హంద్రీనీవా నీటిని కనెక్షన్ ఇచ్చి సగం గ్రామానికి మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఎస్వీ నగర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ మాత్రం గంజహళ్లి చెరువులో ఉన్న మోటార్, పెద్ద వంక దగ్గర ఉన్న బోర్ మోటార్ ద్వారా రెండు బోర్లు కలియక నీటిని వాటర్ ట్యాంకు కనెక్షన్ ఇచ్చి ట్యాంక్ పరిధిలో గ్రామంలో సగానికి పైగా ఉన్న ఎస్వీ నగర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఒక్కో బోరు మోటర్ నీళ్లు ఒక విధంగా ఉండటంతో నిరు కలుషితం కావడంతో ఫ్లోరిన్ నీటిపై తెలియడుతుంది. అలాంటి కలుసిత నీరు తాగడంతో, చిన్న, పెద్ద తేడాలేకుండా వైరల్ ఫీవర్, దగ్గు జలుబు, మోకాళ్ళ, ఒళ్ళు నొప్పులు బారినపడి హాస్పటల్లో చుట్టూ తిరుగుతూ జేబులు చిల్లులు పడుతున్నాయని, ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారు. హామీ ఇచ్చిన ఇప్పటి టిడిపి నాయకులు త్రాగునీటి సరఫరా పై ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు, ఓట్ల టైంలో మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారని, కనీసం ప్రజల అవసరాల నిమిత్తం త్రాగునీరు అందించలేని, పాలకులకు పదవులు ఎందుకు, ప్రజా సమస్యలు పట్టని ప్రజాప్రతినిధులు గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అడుక్కునే పరిస్థితి, అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు గ్రామానికి సమీపంలో హంద్రీనీవా పుష్కలంగా నీరు ప్రవహిస్తున్న, త్రాగునీటి సరఫరా కల్పించడంలో పాలకుల విఫలమయ్యారని, గ్రామస్థాయిలో కూడా నాయకులు ప్రజా సమస్యలు మరవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేరుకేమో గొప్పలు సమస్యలేమో గాలికి వదిలేస్తున్నారు. అభివృద్ధి చేయాలంటే మా పార్టీకే సాధ్యమని , చెప్పే నాయకులు గ్రామంలో కనీసం త్రాగునీటి సరఫరా చేయలేకపోతున్నారు. ఇదేనా అభివృద్ధి గ్రామంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే, ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న, గ్రామంలో పాలన వ్యవస్థ ఏమాత్రం మారలేదని, గత వైసిపి ప్రభుత్వం లో గ్రామం ఎలాగా ఉందో ఇప్పటికీ ఆ గ్రామం అలాగే ఉందని ఆవేదన చెందుతున్న గ్రామ ప్రజలు,