మెనూలో లోపాలు సహించేదిలేదు.

* కాలం చెల్లిన ఆహార పదార్థాలు పెడితే చర్యలు తప్పవు. * గుడ్లు నాణ్యత లేకపోతే గుత్తేదారుల పై చర్యలు తప్పవు

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.11. 2026 పోతవరం గ్రామం ఎంపీపీ పాఠశాలలో పాడైపోయిన గుడ్లు వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఉన్నతాధికారుల దృష్టికి మెనూ సమస్యలు ఎమ్మెల్యే,రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి విద్యార్ధులకు అందించే ఆహార పదార్థాల మెనూలో ఎలాంటి లోపాలు ఉన్నా సహించేది లేదని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలో ఆమె మంగళవారం పలు పాఠశాలలు, వసతి గృహాలపై సుడిగాలి పర్యటన చేశారు. దేవీపట్నం మండలం పోతవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఆ పాఠశాలలో పాడైపోయిన గుడ్లు విద్యార్ధులకు అందించిన సంఘటన పై ఆరా తీసారు. రికార్డులు పరిశీలించి వాస్తవంగా రికార్డు ప్రకారం 181 గుడ్లు ఉండాల్సి ఉండగా తేడా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పాఠశాల ప్రధానోపాద్యాయులు కె.రామకృష్ణ దొర, వంటమనిషి రామలక్ష్మిలకు హెచ్చరిక జారీ చేశారు.గుత్తేదారులు సకాలంలో అందించే పూర్తి నాణ్యతతో ఉన్న సరుకులు మాత్రమే తీసుకోవాలన్నారు.ఒకవేళ గుత్తేదారులు నాణ్యత లేని సరకులు సరఫరా చేస్తే తిరస్కరించాలన్నారు. అలా కాని పక్షంలో నిర్లక్ష్యం ఎవరిదైతే ఉందో వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని రకాల పదార్థాలు తనిఖీ చేసి పరిశీలించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు పెట్టొద్దని సూచించారు. దీనిపై ఐటిడిఎ పిఓ, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. గుత్తేదారుల్ని కూడా అవసరం అయితే మార్చడానికి ఉన్నతాధికారులకు నివేదించినట్లు పేర్కొన్నారు. అనంతరం దామనపల్లి ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్ధులతో మాట్లాడారు. ఉత్తీర్ణత శాతం పెంపుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలోని పలు సమస్యలు కోతులు సమస్య ఉందని, క్రీడా మైదానం లెవెలింగ్ చేయాలని, ప్రహరీ గోడలపై పెన్సింగ్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆమె పరిష్కారం హమీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసిల్దార్ కె.సత్యనారాయణ, సహాయ గిరిజన సంక్షేమ అధికారి జల్లి శంభుడు, ప్రధానోపాధ్యాయురాలు బి.చంద్రకళ, మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల చంటిబాబు, సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ముండ్రు మధుసూధనరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి గంగాధర రావు, తెలుగు యువత అధ్యక్షులు జొన్నల శ్రీనివాస్ కుమార్, ఏ.ఎమ్.సి డైరెక్టర్ జొన్నల రాంబాబు, క్లస్టర్ ఇంచార్జి ఎమ్.వీర వెంకట సత్యనారాయణ, రేలంగి రాంబాబు, పుట్టపల్లి మల్లేష్, నాగేశ్వరరావు, దబ్బ నాని అధిక సంఖ్యలో కూటమి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *