విత్తనాల వల్ల మొక్కజొన్న పంట నష్టం… నష్టపరిహారం ఇవ్వాలని రైతు డిమాండ్

"వంట నష్టపరిహారం చెల్లించాలంటూ రైతు ఆవేదన"

పయనించే సూర్యుడు మార్చి 11 రాజేష్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ సంగమేశ్వర ట్రేడర్స్ ప్రైవేట్ షాపులో కొనుగోలు చేసిన విత్తనాల వల్ల మొక్కజొన్న పంట నష్టపోయిందని రైతు దండు భూపాల్ ఆరోపించారు. సూరంపల్లి గ్రామానికి చెందిన దండు భూపాల్ (సన్నాఫ్ కిష్టయ్య) తెలిపిన వివరాల ప్రకారం, నూజివీడు కంపెనీకి చెందిన విన్నర్ రకం విత్తనాలను ఒక ఎకరాకు రెండు బ్యాగులు చొప్పున శ్రీ సంగమేశ్వర ట్రేడర్స్ వద్ద కొనుగోలు చేసి పంట వేశారు. అయితే పంట చివరి దశలో విల్ట్ వ్యాధి రావడంతో మొత్తం మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని షాప్ యజమాని నాగప్పకు పలుమార్లు తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని భూపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ఒక ఎకరా మొక్కజొన్న పంటకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *