పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.11.2026 దేవీపట్నం మండలం పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటిఏ) మండల నాయకులు చిచ్చడి శేషారావు, సోడే కన్నం రాజు,ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్, రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర మొదలైన పెద్దలు ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్ష కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీ పరిధిలోని దామనపల్లి (ముసిని గుంట) బాలికలు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల పదో తరగతి చదువుతున్న 51 మంది విద్యార్థినులకు పరీక్ష కిట్లు అందజేశామన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.చంద్రకళ మాట్లాడుతూ…పదో తరగతి విద్యార్థులు దేవీపట్నం మండలాన్ని రాష్ట్రస్థాయిలో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ (ఏటిఏ) మండల నాయకులు చిచ్చడి శేషరావు, సోడే కన్నం రాజు మాట్లాడుతూ… విద్యార్థినులు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి మీ యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాఠశాలకు,మీ యొక్క తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు విద్యార్థినులకు ఉద్దేశించి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారన్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బి.చంద్రకళ, ఏ.వెంకటేశ్వరరావు (శ్రీనివాస్), కె.రణదీప్, పి.బుల్లియ, టి.సాంబశివరావు, శివరామకృష్ణ, ఆదివాసీ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం బంగారు బాబు, సొసైటీ మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర, కారం రంగారావు దొర(రిటైర్డ్ ఉద్యోగి జల వనరుల శాఖ), చవలం విద్యాసాగర్ భారత్ ఆదివాసీ పార్టీ డివిజన్ ప్రసార కార్యదర్శి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.