విద్యార్థులే ఉపాధ్యాయులుగా… కారుకొండ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా

పయనించే సూర్యుడు మార్చి 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల కారుకొండలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవంను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులు, అధికారులు పాత్రలను నిర్వహిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌గా మిద్దె నిహారిక (7వ తరగతి), జిల్లా విద్యాధికారి (డీఈఓ)గా వట్టెం సాయిశ్రీ (7వ తరగతి), మండల విద్యాధికారి (ఎంఈఓ)గా కొత్తూరు ఇందు (7వ తరగతి), హెడ్మాస్టర్‌గా దేవరకొండ మధు (7వ తరగతి) బాధ్యతలు స్వీకరించి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ పాత్రలను సమర్థంగా పోషిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీమతి ఉమారాణి శేఖర్రావు హాజరై మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ రఘునందన్ శర్మ, పాలెం స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీ సయ్యద్ మోహినుద్దీన్, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీమతి ఆలూరి దివ్య, ఉపసర్పంచ్ శ్రీ శ్రీనివాస్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామకృష్ణ, ఉపాధ్యాయులు రామకృష్ణ, ఇంద్రాణి, భాగ్యలక్ష్మి, శ్రీకాంత్, లావణ్య, భారతి, చెన్నమ్మతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.