విద్యుత్ అమెండ్మెంట్ బిల్2025 ను రద్దు చేయాలి దుర్గాఅశోక్ వాతాడి

పయనించేసూర్యుడు. న్యూస్. 11. పిబ్రవరి. పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిదిలొని సింగూర్ లో నేటిరోజున నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ హెచ్ ఈ ఎస్ సింగూర్ నందు లంచ్ అవర్ డెమోననిస్ట్రేషన్. కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మినీ హైడల్ స్టేషన్స్ పోచంపాడు సర్కిల్ చైర్మన్ మరియు కన్వీనర్ దుర్గా అశోక్ మరియు కుర్మి పాండయ్య మాట్లాడుతూ. సుదీర్ఘకాలంగా విద్యుత్ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్.మరియు బీహార్. ప్రాంతాలలో దక్షిణాంచల్. పూర్వాంచల్ ప్రాంతాల విద్యుత్ కంపెనీలను ప్రైవేటుపరం చేసిందని* వాటిని తక్షణం రద్దు చేయాలని మరియు పార్లమెంటు సమావేశాలలో విద్యుత్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశ పెట్టే ఆలోచనలను ఉపసంహరించుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈరోజు విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అందులో భాగంగానే తెలంగాణ విద్యుత్ సంస్థలలో అన్ని థర్మల్ మరియు హైడల్ ప్రాంతాలలో, ట్రాన్స్కో మరియు డిస్కం కంపెనీలలో సైతం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని విడనాడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు నాగేంద్ర. కుందన్. మరియు1104. నాయకులు చంద్రయ్య, జహంగీర్, హుస్సేన్ ఖాన్, చంద్రశేఖర్, ఇక్బాల్, మల్లేష్, ఆంజనేయులు, లక్ష్మణ్, బాబర్, లక్ష్మమ్మ కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. టీఎస్పీఈజేఏసీ నాయకత్వం, యం.ఎచ్.యస్. పోచంపాడు సర్కిల్, యస్.ఎచ్.ఈ.యస్. సింగూర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *