పయనించే సూర్యుడు, మార్చి 11 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గ్రామ సర్పంచ్ వెంకటయ్య గౌడ్ తనిఖీ చేశారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి రోగులకు 24గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రజలకు మెరుగైన వైద్యం అందించి పేషెంట్లకు కావలసిన మందులు ఇవ్వాలని వైద్యులకు తెలియజేశారు. గ్రామంలో అంతర్గత రహదారులు శుభ్రం చేయుట, మురికి కాలువలు శుభ్రం చేయుట, తడి ప్రదేశాలలో బ్లీచింగ్ చల్లుట, మురికి కాలువల చివరన ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కాలనీవాసులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, గ్రామ కార్యదర్శి గిరి గౌడ్, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను, వార్డు సభ్యులు గోసులు కొండయ్య, మసిగుండ్ల వెంకటేష్, బాదేపల్లి రమేష్, శేఖర్, రాఘవరెడ్డి, పాలది రంగనాథం, జంగలి ఆనంద, రేవల్లి రాజు, మారేపల్లి శ్రీను, ముదికొండ రమేష్, పురుషోత్తం చారి, చీముల తిరుపతి రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.