పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 11 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. ప్రతినిత్యం ప్రజాపక్షంగా నిలిచే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ ఏటా అడుగుపెడుతున్న నేపథ్యంలో మార్చి 12వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా పండగ వలె పలాస నియోజకవర్గం లో నిర్వహించి విజయవంతం చేయాలని వైయస్సార్సీపి జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధన రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విలువలు.. విశ్వసనీయతే వైఎస్ఆర్సిపి పార్టీ మూల స్తంభాలని, సంక్షేమం,అభివృద్ధి పార్టీ సిద్ధాంతాలని, ప్రజా పక్షమై పోరాటాలు చేయాలన్నా, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలన్నా వైయస్సార్సీపి తోనే సాధ్యమన్నారు. ప్రజా ఆకాంక్షల మేరకు ప్రజల గుండెల్లో ఆవిర్భవించిన పార్టీ 15 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించింది అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ దాడులను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేస్తుందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వైయస్సార్సీపి ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయంగా నిర్వహించాలన్నారు. పలాస నియోజకవర్గం లో రాష్ట్ర మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆదేశాల మేర ప్రతి గ్రామం, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ కేంద్రాలలో పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఎగరవేయాలి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు రంగులు వేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలన్నారు. పండుగ వాతావరణం లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైయస్ఆర్సీపీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.