
పయనించే సూర్యుడు: మార్చి 11/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె.విజయ బాబు సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం ,మర్లపాడు గ్రామం ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పశువులకు మార్చి 10 వ తారీకు నుండి ఏప్రిల్ 9 వ తారీకు వరకు ఉచిత గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలు ఇంటి ఇంటికి వెటర్నరీ డాక్టర్ లు వెళ్లి పశువులకు టీకాలు అందించే కార్యక్రమం ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యేరాగమయి దయానంద్ ఆధ్వర్యంలో మర్లపాడు పశువుల హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో రైతులకు పశువులకు వచ్చే వ్యాధులు మరియు నివారణ చర్యలు మరియు పశు వైద్యం పై అవగాహనా కల్పించిన ప్రభుత్వ పశు వైద్యులు అనంతరం గేదలకు మగ దూడలు పుట్టే విధంగా ఇంజెక్షన్స్ అందుబాటులో వున్నాయి అని రైతులకు తెలియజేసారు ఈ కార్యక్రమం లో డి వి ఏ హెచ్ ఓ డాక్టర్ పురేందర్ మర్లపాడు వి ఏ ఎస్ డాక్టర్ రాజశేఖర్, కందుకూరు వి ఏ ఎస్ సోఫియా,వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, మర్లపాడు సర్పంచ్ ఆంధ్రయ, వేంసూరు సర్పంచ్ ఫకృద్దీన్, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, వెల్డి జగన్మోహన్ రావు, మర్లపాడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు